మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుడు ఏజీ పెరారివాలన్‌కు ఊరట లభించింది. అతన్ని విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, బీఆర్ గవాయి, ఏఎస్ బొప్పన్నలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. రాజ్యాంగంలోని 142 అధికరణ ద్వారా ధర్మాసనం ఈ ఆదేశం చేసింది. ఆర్టికల్ 161 కింద పెరారివాలన్‌ను విడుదల చేయాలని పెట్టుకున్న అభ్యర్థనపై తమిళనాడు గవర్నర్ తన నిర్ణయాన్ని తీసుకోవడం జాప్యం చేస్తున్నట్టు సుప్రీం పేర్కొన్నది. పెరారివాలన్ రిలీజ్‌కు రాష్ట్ర క్యాబినెట్ అంగీకరించిందని, ఇక ఆర్టికల్ 142 ప్రకారం ఆ నిందితుడిని రిలీజ్ చేయడం సమంజసమే అని సుప్రీం అభిప్రాయపడిరది. 31 ఏళ్ల తర్వాత పెరారివాలన్ జైలు జీవితాన్ని గుడ్‌బై చెప్పనున్నారు. 1998లో అతనికి మరణశిక్షను ఖరారు చేశారు. ఆ తర్వాత 2014లో సుప్రీం ఆ శిక్షణు జీవితాల శిక్షగా మార్చింది. ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు అతనికి బెయిల్‌ను మంజూరీ చేసింది.














