ఆర్థిక పరమైన ఆంశాలపై నియంత్రణలు విధించిన కెనడా తాజాగా ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఆంక్షలు విధించడానికి సిద్ధమైంది. పుతిన్‌తో పాటు రష్యాకు చెందిన వెయ్యి మంది కెనడాలోకి ప్రవేషించకుండా నిషేధం విధిస్తూ రూపొందించిన బిల్లును సెనెట్‌లో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ఆమోదం పొందినట్లయితే పుతిన్‌తో పాటు అతని ప్రభుత్వలోని అధికారులు, మిలటరీ పెద్దలు కెనడాలోకి ప్రవేశించడానికి వీలుండదు. ఉక్రెయిన్‌పై ఏకపక్షంగా దాడికి దిగిన పుతిన్‌తో పాటు అతనికి మద్దతుగా నిలిచిన ముఖ్యమైన వ్యక్తులు కెనడాలోకి రావడానికి వీళ్లేకుండా బ్యాన్ చేస్తున్నామని ఆ దేశ ప్రజా భద్రత మంత్రి మార్కో మెడిసినో తెలిపారు.














