Skip to main content

Namaste NRI

అట్టహాసంగా ప్రారంభమైన కేన్స్ చలనచిత్రోత్సవం

ప్రపంచ చలనచిత్ర రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన కేన్స్‌ చలనచిత్రోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ ఉత్సవాల్లో భారత్‌కు గౌరవ సభ్య దేశం హోదా దక్కడంతో కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ నేతృత్వంలో పలువురు  సెలబ్రిటీలు ఈ వేడుకలకు హాజరయ్యారు.  మాధవన్‌, రిక్కీ కేజ్‌, వాణీ త్రిపాఠి, ప్రసూన్‌  జోషి, నవాజుద్దీన్‌ సిద్దిఖీ, శేఖర్‌ కపూర్‌, ఏ.ఆర్‌. రెహమన్‌..తొలి రోజున ఎర్రతివాచీపై ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ ఏడాది జ్యూరీ సభ్యురాలిగా దీపిక, సభ్యసాచి చీరకట్టులో ఆకట్టుకున్నారు.  తమన్నా తెల్లని దుస్తుల్లో మెరిసిపోయారు. నటి ప్రముఖ మోడల్‌ ఊర్వశీ రౌతెలా తెల్ల గౌనులో మెరిసిపోగా విశ్వనటుడు కమల్‌ హాజన్‌ విక్రమ్‌ కోటలో  స్రైలిష్‌ ఎంట్రీ ఇచ్చారు.

Social Share Spread Message

Latest News