Skip to main content

Namaste NRI

విదేశీ పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానం : మంత్రి కేటీఆర్‌

విదేశీ పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా మారిందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు.  లండన్‌ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌  యునైటెడ్‌ కింగ్‌డం`ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ (యూకేఐబీసీ) ఎస్‌ఎంఎంటీ ఏర్పాటు చేసిన మూడో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆటో మొబైల్‌ ఇండస్ట్రీ ప్రతినిధులతో కేటీఆర్‌ సమావేశమై తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఎలక్ట్రిక్‌ వెహికల్‌ రంగంలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందని తెలిపారు.  రాష్ట్రంలో సమగ్రమైన, ప్రగతిశీల ఈవీ పాలసీని ప్రారంభించామని తెలిపారు. ఇప్పటికే పలు ఈవీ కంపెనీలు తమ కార్యకలాపాలను తెలంగాణలో ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయని గుర్తు చేశారు.

Social Share Spread Message

Latest News