రానా, సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా విరాటపర్వం. డి.సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. వేణు ఊడుగుల దర్శకుడు. ఈ సినిమాను జూలై 1న రిలీజ్ చేయనున్నట్టు ఇటీవల ప్రకటించింది చిత్ర యూనిట్. అయితే ఇంకాస్త ముందుగానే జూన్ 17న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల ద్వారా కొత్త విడుదల తేదీతో కూడిన పోస్టర్లను పంచుకున్నారు. తెలంగాణ ప్రాంతంలోని నక్సల్ ఉద్యమం నేపథ్యంలో సాగే లవ్‌స్టోరీగా ఈ చిత్రం రూపొందింది. ఇందులో కామ్రేడ్ రవన్నగా రానా, వెన్నెల పాత్రను సాయి పల్లవి చేశారు. 1990లో జరిగిన వాస్తవ ఘటనల ప్రేరణతో రూపొందిన సినిమా ఇది అని చిత్రయూనిట్ వెల్లడిరచింది. ప్రియమణి, నందితాదాస్, నవీన్‌చంద్ర, సాయిచంద్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి స్వరకర్త. సినిమాటోగ్రఫీ: డానీ సాంచెజ్ లోపెజ్, దివాకర్ మణి.














