Namaste NRI

బ్రిటన్‌ ప్రభుత్వం శుభవార్త.. జాప్‌ ఆఫర్‌ లేకున్నా

ప్రపంచవ్యాప్తంగా అత్యంత నిపుణులైన గ్రాడ్యుయేట్లకు బ్రిటన్‌ ప్రభుత్వం రెడ్‌ కార్పెట్‌ స్వాగతం పలుకుతున్నది. హై పొటెన్షియల్‌ ఇండివిడ్యుయల్‌ (హెచ్పీఐ) వీసా విధానాన్ని తీసుకొచ్చింది. ఆయా నిపుణుల విద్యార్హతలను బట్టి రెండేండ్ల నుంచి మూడేండ్ల వరకు పని చేసేందుకు అక్కడే నివసించేందుకు ఈ వీసా అనుమతి ఇస్తుంది. ఈ వీసా కింద బ్రిటన్‌కు వెళ్లే వారికి జాబ్‌ ఆఫర్‌ గానీ, స్పాన్షర్‌షిప్‌గానీ అవసరం లేదు. సెల్ఫ్‌ ఎంప్లాయిగా గానీ, వలంటీర్‌గా గానీ బ్రిటన్‌కు రావచ్చు. కాకపోతే వీసాకోసం దరఖాస్తు చేసుకున్న వారు ప్రపంచంలోనే పేరొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా అందుకుని ఉండాలి. వీసాకు దరఖాస్తు చేయడానికి పదేండ్లలోపే ఆ పట్టా అందుకుని ఉండాలి. వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత గల విద్యా సంస్థల జాబితాను బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రతియేటా గవ్‌.యుకే వెబ్‌సైట్‌లో విడుదల చేస్తుంది. వీసా దరఖాస్తు దారుల శక్తి సామర్థ్యాలు, కోర్సులను బట్టి ఎటువంటి జాప్‌ ఆఫర్‌ లేకుండానే బ్రిటన్‌కు రావచ్చునని బ్రిటన్‌ ఇమిగ్రేసన్‌ శాఖ మంత్రి కెవిన్‌ ఫాస్టర్‌ తెలిపారు. గ్రాడ్యుయేట్‌ వీసాపై వచ్చిన వారికి ఈ హెచ్చ్‌ఐ వీసా వర్తించదు. బ్యాచ్‌లర్‌ లేదా మాస్టర్‌ డిగ్రీపై వచ్చిన వారికి రెండేండ్ల వీసా ఇస్తారని బ్రిటన్‌ ప్రభుత్వం తెలిపింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events