ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) అలహాబాద్ విద్యార్థికి గూగుల్ 1.4 కోట్ల వార్షిక వేతన ప్యాకేజ్‌తో జాబ్ ఆఫర్ ఇచ్చింది. నెలకు దాదాపు రూ.11.6 లక్షల వేతనంతో ప్రతం ప్రకాష్ గుప్తాకు టెక్ దిగ్గజం నుంచి బంపర్ ఆఫర్ వచ్చింది. భారీ వేతన ప్యాకేజ్‌తో ప్రకాష్ గుప్తా గూగుల్ లండన్ ఆఫీస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా జాబ్ ఆఫర్ అందుకున్నాడు. టెక్ దిగ్గజం నుంచి వచ్చిన బంపర్ ఆఫర్ గురించి గుప్తా తన లింక్డిన్ ఖాతాలో పొందుపరిచాడు. ప్రపంచంలో అతిపెద్ద కంపెనీల నుంచి తనకు అద్భుత ఆఫర్లు వచ్చాయని, గూగుల్ ఆఫర్‌ను తాను స్వీకరించినట్టు మీతో పంచుకుంటున్నాని గుప్తా లింక్డిన్‌లో రాసుకొచ్చాడు. ఈ ఏడాది తన గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే గూగుల్ లండన్ ఆఫీస్‌లో చేరతానని తెలిపారు.














