Skip to main content

Namaste NRI

జో బైడెన్‌ కీలక ప్రకటన.. ఉక్రెయిన్‌కు

రష్యా టార్గెట్లను చేధించేందుకు ఉక్రెయిన్‌కు లాంగ్‌ రేంజ్‌ అడ్వాన్స్‌డ్‌ రాకెట్‌ సిస్టమ్స్‌ను ఇస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తెలిపారు. సుదీర్ఘ దూరం ప్రయాణించే అత్యాధునిక రాకెట్‌ వ్యవస్థలను ఉక్రెయిన్‌కు ఇవ్వడానికి అంగీకరించారు.  సుమారు 700 మిలియన్ల డాలర్ల ఖరీదైన ఆయుధ ప్యాకేజీకి అమెరికా ఓకే చెప్పింది. దానిలో భాగంగా ఈ అడ్వాన్స్‌డ్‌ రాకెట్లను ఇవ్వనున్నారు. సుమారు 80 కిలో మీటర్ల దూరంలో ఉన్న టార్గెట్లను ఈ రాకెట్ల అత్యంత కచ్చితత్వంతో చేధించగలవు. అయితే రష్యాపై దాడులు జరిపేందుకు మిస్సైళ్లు వాడబోమని ఉక్రెయిన్‌ హామీ ఇచ్చిన నేపథ్యంతో అమెరికా ఈ ప్రకటన చేసింది.

Social Share Spread Message

Latest News