ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాకు చైనా షాక్ ఇచ్చింది. రష్యా విమానయాన సంస్థలకు చెందిన విదేశీ విమానాలేవీ తమ గగనతలంలో ఎగరకుండా చైనా నిషేధించింది. భారీ విమానయాన సంస్థలకు నెలవైన యూరోపియన్ యూనియన్, రష్యాకు విమానాలను అమ్మేందుకు, అద్దెకు ఇచ్చేందుకు వీలు లేకుండా ఫిబ్రవరిలో నిషేధం విధించింది. విదేశీ విమానయాన సంస్థలు యాజమాన్య వివరాలను పునరుద్ధరించుకోవాలని చైనా కూడా తేల్చి చెప్పింది. ధ్రువపత్రాలను సమర్పించని విమానాలను రష్యా డి రిజిస్ట్రేషన్ చేసింది. ఆ విమానాలు తమ గగనతలంలో తిరిగేందుకు వీల్లేకుండా నిషేధించినట్లు చైనా పేర్కొంది. ఆ ఆంక్షల కారణంగా జప్తు చేయకుండా ఉండేందుకు విదేశీ విమానాలను యాజమాన్యాలు రష్యాలో తిరిగి రిజిస్ట్రేన్ చేసుకోవాలని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేశారు.














