జగపతిబాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం సింబా. ది ఫారెస్ట్ మ్యాన్ అన్నది ఉపశీర్షిక. ఆరణ్యం నేపథ్యంలో అల్లుకున్న కథతో రూపొందుతోంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ చిత్ర ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. అందులో జగపతిబాబు భుజాలపై చెట్లను మోసుకుంటూ వెళ్లడం ఆసక్తిరేకెత్తిస్తోంది. ప్రకృతి తనయుడు ఇతడు. జగపతిబాబుని సింబాగా పరిచయం చేస్తున్నాం. ఈ చిత్రంలో జగపతిబాబు అడవుల్లో నివసించే మాచోమ్యాన్‌గా కనిపిస్తారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రాన్ని సంపత్ నంది, రాజేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మురళీ మోహన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సంగీతం: డి.కృష్ణ సౌరభ్, ఛాయాగ్రహణం: కృష్ణ ప్రసాద్.




























