Skip to main content

Namaste NRI

జో బైడెన్‌ దంపతులను రహస్య ప్రాంతానికి తరలింపు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఆయన భార్య జిల్‌ బైడెన్‌ను అత్యవసరంగా రహస్య ప్రాంతానికి తరలించారు. అధ్యక్షుడు నివాసంపైకి  పొరపాటున ఓ విమానం దూసుకొచ్చింది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆగమేఘాలపై బైడెన్‌, ఆయన జీవిత భాగస్వామిని అక్కడి నుంచి తరలించారు. వారికి ఎలాంటి ప్రాణహాని లేదని అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్‌ ప్రకటించింది.  డెలావర్‌లోని రిహోబత్‌ బీచ్‌లో ఉన్న అధ్యక్ష విడిది నివాసానికి బైడెన్‌ కుటుంబం వచ్చింది. పొరపాటున ఓ చిన్న విమానం నిషేధిత గగనతలంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత బైడెన్‌ కుటుంబాన్ని బీచ్‌ హౌజ్‌కు తీసుకొచ్చారు. భద్రతా సిబ్బంది ఆ విమానాన్ని పంపేశారు. పైలట్‌ పొరపాటుగా ఆ ప్రాంతంలోకి విమానంతో ప్రవేశించాడని, ఫ్లయిట్‌ రేడియో ఛానల్‌ సరిగాలేదని, ఫ్లయిట్‌ గైడెన్స్‌ను కూడా అనుసరించలేదని గుర్తించారు.

Social Share Spread Message

Latest News