Namaste NRI

మ్యాన్‌ ఆఫ్‌ డూమ్‌ మైఖేల్‌ పోస్టర్‌ను విడుదల చేసిన రానా

తేజ సజ్జ మీరోగా నటిస్తున్న సినిమా హనుమాన్‌. అమృత్‌ అయ్యర్‌ నాయికగా నటిస్తున్నది. వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం నుంచి మ్యాన్‌ ఆఫ్‌ డూమ్‌ మైఖేల్‌ అంటూ విలన్‌ పోస్టర్‌ను హీరో రానా విడుదల చేశారు. ఈ క్యారెక్టర్‌లో వినయ్‌ రాయ్‌ నటించారు. బ్యాట్‌మ్యాన్‌ సినిమాకు జోకర్‌, సూపర్‌ మ్యాన్‌ సినిమాకు లూథర్‌లా హను మాన్‌కు మైఖేల్‌ విలన్‌గా ఆకట్టుకుంటాడని, అతని టెక్నాలజీ ఆశ్చర్యపరుస్తుందని చిత్ర బృందం చెబుతున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ చివరి దశలో ఉందీ. ఈ చిత్రాన్ని ప్రశాంత్‌ శర్మ రూపొందిస్తున్నారు. ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శ్రీమతి చైతన్య సమర్పణలో కె నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. సూపర్‌ హీరో మూవీగా పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర, ఎడిటర్‌: ఎస్బీ రాజు తలారి, సంగీతం: అనుదీప్‌ దేవ్‌, హరి గౌరా, జై క్రిష్‌, కృష్ణ సౌరభ్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events