Namaste NRI

భారతీయ అమెరికన్‌కు కీలక పదవి.. సైంటిఫిక్‌ అడ్వైజర్‌గా

భారత, అమెరికా సంతతికి చెందిన డాక్టర్‌ ఆర్తి ప్రభాకర్‌ను వైట్‌హౌజ్‌ సైంటిఫిక్‌ అడ్వైజర్‌గా అధ్యక్షుడు జో బైడెన్‌ నియమించారు. ఒకవేళ సేనేట్‌లో ఆమోదం దక్కితే, అప్పుడు బైడెన్‌కు చీఫ్‌ సైన్స్‌ అడ్వైజర్‌గా డాక్టర్‌ ఆర్తి విధులు నిర్వరిస్తారు. డాక్టర్‌ ఆర్తికి ఆమోఘమైన జ్ఞానం ఉందని, ఇంజినీర్‌గా ఆమెను గొప్పగా గుర్తిస్తారని, ఫిజిసిస్ట్‌గా కూడా ఆమెకు ఎనలేని గుర్తింపు ఉన్నట్లు బైడెన్‌ తెలిపారు. కఠినమైన సవాళ్లను పరిష్కరించేందుకు అసాధ్యాన్ని సుసాధ్యం చేసేందుకు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగంలో భారతీయ అమెరికన్లకు పెద్ద పీట వేయనున్నట్లు తెలిపారు. అమెరికాలో ఆవిష్కరణల బృందం చాలా శక్తివంతంగా ఉందని భావిస్తున్నానని, డాక్టర్‌ ఆర్తి ప్రభాకర్‌ను సేనేట్‌ ఆమోదిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం  చేశారు.

                అమెరికా ప్రభుత్వానికి చెందిన రెండు రీసర్చ్‌ ఏజెన్సీల్లో డాక్టర్‌ ఆర్తి ప్రభాకర్‌ కీలక పదవుల్లో చేశారు. స్టార్టప్స్‌, కంపెనీలు, వర్సిటీలు, ల్యాబ్‌లు, ఎన్జీవోలతో ఆమె పని చేశారు. ఇంజినీరింగ్‌తో పాటు అప్లైడ్‌ ఫిజిక్స్‌లో ఆమెకు విస్తృత అనుభవం  ఉంది. ఆర్తి మూడేళ్ల వయసులో ఉన్నప్పుడు వాళ్ల కుటుంబం అమెరికాకు వలస వచ్చింది.  తొలుత చికాగోలో ఆ తర్వాత పదేళ్ల వయసులో టెక్సాస్‌లో సెటిలయ్యారు.  టెక్సాస్‌ టెక్‌ వర్సిటీలో ఆమె ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ పూర్తి చేసింది. కాలిఫోర్నియా వర్సిటీ నుంచి అప్లైడ్‌ ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ అందుకున్న తొలి మహిళ ఆమె. ఇదే వర్సిటీలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో ఎంఎస్‌ పూర్తి చేసింది. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో ఫెల్లోగా చేసింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events