Skip to main content

Namaste NRI

డాలస్‌లో వైభవంగా శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం

అమెరికాలోని డాలస్‌లో శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణం వైభవంగా జరిగింది. డాలస్‌లోని క్రెడిట్‌ యూనియన్‌ ఆఫ్‌ టెక్సాస్‌ ఈవెంట్‌ సెంటర్‌ వేదికగా కన్నుల పండువగా సాగింది. డాలస్‌ తెలంగాణ ప్రజా సమితి ఆధ్వర్యంలో జరిగిన స్వామివారి కల్యాణ వేడుకకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేదమంత్రాల మధ్య శ్రీవారి కల్యాణోత్సవం ఘనంగా శ్రీనిర్వహించారు. కల్యాణోత్వవంలో పాల్గొనేందుకు ప్రత్యేకంగా స్పాన్సర్‌షిప్‌ ప్యాకేజీలను డాలస్‌ తెలంగాణ ప్రజా సమితి అందుబాటులో ఉంచింది. కన్నులపండువగా జరిగిన కల్యాణోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఏపీ అధికార భాష సంఘం చైర్మన్‌ డాక్టర్‌ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌, కడప జడ్పీ చైర్‌పర్సన్‌ అమర్‌నాథ్‌ రెడ్డి, చిత్తూరు మాజీ ఎంపీ మహాసముద్రం జ్ఞానేందర్‌ రెడ్డి హాజరై విశేష సేవల్లో పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News