Namaste NRI

శ్రీదుర్గ క్రియేషన్స్‌ నూతన చిత్రం ప్రారంభం

అఖిల్‌ రాజ్‌, అనన్య నాగళ్ల జంటగా కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ సినిమా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో దర్శకులు విజయ్‌ కనకమేడల, కాశీ విశ్వనాథ్‌, జి.నాగేశ్వర్‌ రెడ్డి అతిథులుగా పాల్గొన్నారు. ముహూర్తం సన్నివేశానికి కాశీ విశ్వనాథ్‌ క్లాప్‌ కొట్టగా దగ్గుబాటి అభిరామ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ఈ సందర్భంగా అనంతరం నటి అనన్య మాట్లాడుతూ ఇదొక మంచి లవ్‌స్టోరీ. ఈ కథపై మేమంతా నమ్మకంగా ఉన్నాం అంది. ఇది నా మూడో చిత్రం. యువతరం మొచ్చే ప్రేమకథతో రూపొందుతోంది అన్నారు హీరో అఖిల్‌ రాజ్‌. దర్శకుడు సూర్య మాట్లాడుతూ అందమైన ప్రేమకథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. తూర్పు గోదావరి, పల్లమ్‌ వంటి ప్రాంతాల్లో చిత్రీకరిస్తాంం. ఆగస్టు నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభిస్తాం అన్నారు. ఈ చిత్రానికి సూర్య అల్లంకొండ దర్శకుడు. జి.ప్రతాప్‌ రెడ్డి నిర్మాత. జి.నాగేశ్వర్‌ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ఎడిటర్‌ : ప్రణవ్‌, సినిమాగోగ్రఫీ: వీఆర్కే నాయుడు, సంగీతం: పీఆర్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events