Namaste NRI

అక్కినేని అభిమానులకు శుభవార్త.. ఏజెంట్‌ టీజర్‌ టైమ్‌ ఫిక్స్‌

అఖిల్‌ అక్కినేని హీరోగా నటిస్తున్న చిత్రం ఏజెంట్‌. సాక్షి వైద్య కథానాయిక. ఈ సినిమాలో మలయాళ అగ్ర నటుడు మమ్ముట్టి కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను ఈ నెల 15న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. అఖిల్‌ గూఢచారి ఏజెంట్‌గా కనిపిస్తారు. ఆయన లుక్స్‌ స్టైలిష్‌గా ఉంటాయి. యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ప్రధానాకర్షణగా నిలుస్తాయి. సురేందర్‌ రెడ్డి తనదైన శైలిలో చిత్రాన్ని తీర్చిదిద్దారు అని చిత్ర బృందం పేర్కొంది. సురేందర్‌ రెడ్డి దర్శకుడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌, సురేందర్‌ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రసూల్‌ ఎల్లోర్‌, సంగీతం: హిప్‌హాప్‌ తమిజ, కథ: వక్కంతం వంశీ, సహ నిర్మాతలు: అజయ్‌ సుంకర, దీపారెడ్డి, దర్శకత్వం: సురేందర్‌ రెడ్డి. ఈ సినిమా త్వరలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events