బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కథానాయకుడిగా నటించిన చిత్రం లాల్ సింగ్ చద్ధా. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇందులో నాగచైతన్య ఓ కీలక పాత్ర పోషించారు. ఆమిర్‌ఖాన్‌కి స్నేహితులైన కథానాయకుడు చిరంజీవితో పాటు, నాగార్జున, రాజమౌళి, సుకుమార్, నాగచైతన్య కలిసి ఈ సినిమాని హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వీక్షించారు. చిరంజీవి నివాసంలో ఏర్పాటు చేసిన ఈ ఈ ప్రివ్యూ షోకు ఆమిర్‌ఖాన్ కూడా హాజరయ్యారు. అమీర్‌ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో కరీనా కపూర్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.














