Skip to main content

Namaste NRI

స్టార్ల కోసం లాల్‌ సింగ్‌ చద్దా ప్రత్యేక ప్రివ్యూ

బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం లాల్‌ సింగ్‌ చద్ధా. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహించారు.  ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇందులో నాగచైతన్య  ఓ కీలక పాత్ర పోషించారు. ఆమిర్‌ఖాన్‌కి స్నేహితులైన కథానాయకుడు చిరంజీవితో పాటు, నాగార్జున, రాజమౌళి, సుకుమార్‌, నాగచైతన్య కలిసి ఈ సినిమాని హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వీక్షించారు. చిరంజీవి నివాసంలో  ఏర్పాటు చేసిన ఈ ఈ ప్రివ్యూ షోకు ఆమిర్‌ఖాన్‌ కూడా హాజరయ్యారు.  అమీర్‌ఖాన్‌ ప్రొడక్షన్స్‌, వయాకామ్‌ 18 స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో కరీనా కపూర్‌ ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తోంది.

Social Share Spread Message

Latest News