అగ్రరాజ్యం అమెరికా ఉక్రెయిన్‌కు మరోసారి సాయం చేసింది. ఉక్రెయిన్‌కు మరో 100 కోట్ల డాలర్ల విలువైన సైనిక సామగ్రిని అందజేయడానికి అమెరికా ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇప్పటిదాకా ఇవ్వని కొన్ని రకాల రాకెట్లు, ముందుగుండు, మరికొన్ని ఆయుధాలు ఇందులో ఉన్నాయని అమెరికా రక్షణశాఖ సహాయమంత్రి కొలిన్ కాల్ తెలిపారు. వీటిని సాధ్యమైనంత త్వరగా ఉక్రెయిన్ బలగాలకు అందజేస్తామన్నారు.














