Namaste NRI

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు.. ఎఫ్‌బీఐ షాక్‌!

అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు చెందిన విలాసవంతమైన ఫామ్‌ హౌస్‌, రిసార్ట్‌ మార్‌ `ఎ` లిగోలో సోదాలు నిర్వహించింది.  దర్యాప్తు ఏజెన్సీ ట్రంప్‌ ఇంటిని చుట్టుముట్టి తనిఖీలు చేశారు. అయితే దీనిపై ట్రంప్‌ స్పందించారు. మార్‌ ఎ లెగోలోని పామ్‌ బీచ్‌లోని తన అందమైన నివాసాన్ని ఎఫ్‌బీఐ స్వాదీనం చేసుకుందని, ఇందుకు కారణాలు మాత్రం తెలుపలేదన్నారు. ఎఫ్‌బీఐ చర్య రాజకీయ ప్రతీకారమేనని ట్రంప్‌ ఆరోపించారు. మాజీ అధ్యక్షుడి ఇంటిపై దర్యాప్తు సంస్థ దాడి చేయడం అమెరికాకు ఇది గడ్డు కాలమని పేర్కొన్నారు. అమెరికాలో ఇంతకు ముందు ఏ మాజీ అధ్యక్షుడికి ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదన్నారు. దర్యాప్తు సంస్థకు సహకారం అందిస్తున్నప్పటికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నివాసంపై దాడి చేశారని ఆరోపించారు.  2024 ఎన్నికల్లో పోటీ చేయకుండా తనను ఆపాలని కోరుకునే కరుడుగట్టిన డెమొక్రాట్ల దాడి ఇది అని ట్రంప్‌ విమర్శించారు. అయితే  దీనిపై ఎఫ్‌బీఐ ప్రతినిధిని సంప్రదించగా సమాధానం చెప్పేందుకు నిరాకరించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events