Skip to main content

Namaste NRI

న్యూయార్క్‌లో భారత సంతతి రచయత సల్మాన్‌పై దాడి

అమెరికాలోని న్యూయార్క్‌లో భారత సంతతికి చెందిన ప్రముఖ రచయిత సల్మాన్‌ రష్డీపై ఒక వ్యక్తి కత్తితో దాడి చేశాడు. చౌటౌక్వా  సంస్థలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్‌ రష్డీ, ప్రసంగించేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతలో ఒక వ్యక్తి ఆ వేదికపైకి దూసుకొచ్చాడు. కత్తితో సల్మాన్‌ రష్డీ మెడపై పొడిచాడు. ఈ సంఘటనతో సల్మాన్‌ రష్డీ వేదికపై పడిపోయారని, అక్కడున్న వారు ఆ వ్యక్తిని అడ్డుకున్నారని అసోసియేటెడ్‌ ప్రెస్‌ పేర్కొంది. అక్కడకు వచ్చిన పోలీసులు దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్‌ చేశారని, సల్మాన్‌ రష్డీని అక్కడి నుంచి హెలికాప్టర్‌ అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారని వెల్లడిరచారు.  రష్డీ ఇంటర్వ్యూ చేస్తున్న వ్కఇ్తకి కూడా దాడిలో స్వలప్ప గాయాలైనట్లు తెలిసింది.  రష్డీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియదు. అయితే ఆయనకు ఆపరేషన్‌ జరిగినట్లు తెలిసింది. 75 ఏళ్ల సల్మాన్‌ రష్డీ భారత సంతతి బ్రిటన్‌ పౌరుడు. గత 20 ఏళ్లుగా ఆయన అమెరికాలో ఉంటున్నారు. 1980లో ఆయన రచించిన ది సాటానిక్‌ వెర్సెస్‌ పుస్తకం వివాదాస్పదమైంది. పుస్తకాన్ని 1988లో ఇరాన్‌ నిషేధించింది. నాటి నుంచి ఆయన ప్రాణ ముప్పు, బెదిరింపులను ఎదుర్కొంటున్నార. రష్డీని చంపాలంటూ ఇరాన్‌ దివంగత నేత అయతుల్లా రుహోల్లా ఖొమేనీ ఫత్వా జారీ చేశారు. అలాగే ఆయనను చంపిన వారికి మూడు మిలియన్‌ డాలర్ల రివార్డును కూడా ఇరాన్‌ ప్రకటించింది.  అయితే ఈ దాడికి కారణంపై స్పష్టత రాలేదు.

Social Share Spread Message

Latest News