Skip to main content

Namaste NRI

సలార్‌ ఆగమనం ఆరోజే

ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న పాన్‌ ఇండియా మూవీ సలార్‌ నుంచి తాజా అప్‌డేట్‌ వెలువడిరది. ఈ సినిమా విడుదల తేదీ ఖరారు చేస్తూ చిత్ర బృందం కొత్త  పోస్టర్‌ను విడుదల చేసింది. ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ నిర్మిస్తున్నారు. శ్రుతిహాసన్‌ కథానాయిక. పృథ్విరాజ్‌ సుకుమారన్‌, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో ప్రభాస్‌ కత్తులు చేతబట్టి శత్రువుల్ని చెండాడుతున్నట్లుగా యాక్షన్‌ మోడ్‌లో కలిపించారు. హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నాం అని చిత్ర బృందం పేర్కొంది. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సంగీతం రవి బస్రూర్‌, ఛాయాగ్రహణం: భువన గౌడ.

Social Share Spread Message

Latest News