Namaste NRI

పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ప్రేమ విమానం

సంగీత్‌ శోభన్‌, శాన్వీ మేఘన జంటగా సంతోష్‌ కట దర్శకత్వంలో ప్రేమ విమానం చిత్రం షురూ అయింది. అభిషేక్‌ నామా నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సీన్‌కి గీతా ఆర్ట్‌ బాబీ కెమెరా స్విచ్ఛాన్‌ చేయగా, ఏషియన్‌ గ్రూప్స్‌ భరత్‌ నారంగ్‌ క్లాప్‌ ఇచ్చారు.  సునీల్‌ నారంగ్‌ స్క్రిప్ట్‌ అందించారు. న్యూ ఏజ్‌ లవ్‌ స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కనుంది అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాలో కల్పలత, సుప్రీత్‌, శైలజ ప్రియ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, కెమెరా:  జగదీష్‌ చీకటి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events