Namaste NRI

జిన్నా టీజర్‌ రిలీజ్‌ ఆరోజే

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం జిన్నా.  పాయల్‌ రాజ్‌పుత్‌, సన్నీలియోన్‌ కథానాయికలు. సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీపై నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ని ఆగస్టు 25న విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు వెల్లడిరచాయి. వాణిజ్య ప్రదానంగా సాగే సినిమా ఇది. కోన వెంకట్‌ సమకూర్చిన కథ, కథనాలతో ఇంట్లిపాదీని మెప్పించేలా తీర్చిదిద్దారు దర్శకుడు. ప్రేమ్‌ రక్షిత్‌, అనూప్‌ రూబెన్ప్‌ సాంకేతిక బృందం ఈ చిత్రానికి పనిచేస్తోందని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రం తెలుగు తమిళం, మలయాళం, హిందీలో భాషల్లో తెరకెక్కుతోంది.  విడుదలకి ముస్తాబవుతున్న ఈ సినిమాకి ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, సంగీతం : అనూప్‌ రూబెన్స్‌.

Social Share Spread Message

Latest News