సత్యదేవ్, అతిరా రాజీ జంటగా నటిస్తున్న చిత్రం కృష్ణమ్మ. వీవీ గోపాల కృష్ణ దర్శకత్వం వహించారు. దర్శకుడు కొరటాల శివ సమర్పణలో కృష్ణ కొమ్మలపాటి, కృష్ణమ్మ నిర్మిస్తున్నారు. కాలభైరవ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఏమవుతుందో మనలో.. అనే మెలోడీ సాంగ్‌ను డైరెక్టర్ హరీష్ శంకర్ రిలీజ్ చశారు. అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటను సిథ్ శ్రీరామ్ పాడారు. ప్రేమలోని గాఢతను తెలిపేలా ఏమవుతుందో మనలో పాట ఉంటుంది. సన్ని కూరపాటి విజువల్స్ పాటకు మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. త్వరలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని పేర్కొంది. ఈ చిత్రాన్నికి మాటలు : సురేష్‌బాబా, ఎడిటర్: తమ్మిరాజు, ఆర్ట్: రామ్‌కుమార్, సినిటోగ్రఫీ : సన్ని కూరపాటి.














