శ్రద్దాదాస్, మాస్టర్ మహేంద్రన్, ఆమని, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం అర్థం. మినర్వా పిక్చర్స్ పతాకంపై మణికాంత్ తెల్లగూటి దర్శకత్వంలో రాధిక శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ నెలాఖరులో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా టీజర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ఈ సినిమాలో మహిళా సాధికారత, మానవ సంబంధాల గురించి చర్చించాం. వీఎఫ్ఎక్స్కు కూడా ప్రాధాన్యత ఉంటుంది అన్నారు. అనంతరం శ్రద్దాదాస్ మాట్లాడుతూ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ చిత్రమిది. ఇందులో నేను మానసిక వైద్యురాలి పాత్రలో కనిపిస్తాను. నా కెరీర్లోనే విభిన్నమైన పాత్రను పోషించినందుకు ఆనందంగా ఉంది అని చెప్పింది. థ్రిల్లర్ కథకు వినోదాన్ని మేళవించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. రాకేందుమౌళి మాటలు, పాటలు ప్రధానాకర్షణగా నిలుస్తాయి అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పవన్ చెన్నా, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్. ఈ కార్యక్రమంలో సహ నిర్మాత సాయిదీప్, ఛాయాగ్రాహకుడు పవన్, కళా దర్శకుడు మణి తదితరులు పాల్గొన్నారు.














