Skip to main content

Namaste NRI

యూఎస్‌ ఓపెన్‌ నుంచి వైదొలగిన సానియా మీర్జా

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా యుఎస్‌ ఓపెన్‌ 2022 నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. రెండు వారాలక్రితం కెనడాలో ఆడుతున్నపుడు నా ముంజేయికి, మోచేతికి గాయం అయింది. అయితే నేను పెద్దగా ఈ గాయాలు పట్టించుకోలేదు. నిన్న స్కాన్‌ చేయించుకుంటే గాయం తీవ్రత ఎక్కువ ఉందని తేలింది. ఎముకను పట్టి ఉండే కండరభాగం బాగా నలిగిపోయిందని సానియా  వెల్లడిరచింది. ఈ గాయం నుంచి  కోలుకునేదాకా కొన్ని వారాలు రెస్ట్‌ అవసరం అని అందువల్లనే యూఎస్‌ ఓపెన్‌ నుంచి వైదొలిగినట్లు తెలిపింది. ఈ గాయం వల్ల యూఎస్‌ ఓపెన్‌ పూర్తయ్యాక టెన్సిస్‌కు రిటైర్మెంట్‌ ప్రకటిద్దామనుకున్న  నా ప్లాన్స్‌ అన్నీ చెడిపోయాయి. అందువల్ల ఇప్పుడు రైటైర్‌ కాలేను. ఇతర విషయాలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ ఇస్తాను అని సానియా తెలిపింది.

Social Share Spread Message

Latest News