Skip to main content

Namaste NRI

రంగ రంగ వైభవంగా ట్రైలర్‌

 వైష్టవ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రంగ రంగ వైభవంగా. అర్జున్‌ రెడ్డి ఫేం గిరీసాయ దర్శకత్వం వహిస్తున్నాడు.  కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తుంది. బాపినీడు.బి సమర్పణలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో ట్రైలర్‌ విడుదల కార్యక్రమం జరిగింది.   ఈ సందర్భంగా వైష్ణవ్‌ తేజ్‌ మాట్లాడుతూ  రంగ రంగ వైభవంగా ట్రైలర్‌ ఎంత బాగుందో సినిమా అంతకంటే బాగుంటుంది. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ గారి వల్లే ఓ మంచి టీమ్‌ కలిసి చక్కని సినిమాను తీసుకొస్తున్నాం. మా చిత్రాన్ని చూసి ఎంజాయ్‌ చేసి, సక్సెస్‌ చేయాలని కోరుకుంటున్నాను అని అన్నారు. గిరీశాయ మాట్లాడుతూ అహం లేని ఏ బంధం అయినా రంగ రంగ వైభవంగా ఉంటుందని చెప్పటమే మా సినిమా కథ అన్నారు. మా సినిమా పెద్ద హిట్టవుతుందనే నమ్మకం ఉంది అన్నారు. బీవీఎస్‌ ప్రసాద్‌. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

Social Share Spread Message

Latest News