Namaste NRI

 క్రేజీ ఫెలో టీజర్‌ విడుదల

ఆది సాయికుమార్‌ హీరోగా ఫణికృష్ణ సిరికి తెరకెక్కిస్తున్న చిత్రం క్రేజీ ఫెలో. కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. దివంగన సూర్యవంశి, మర్నా మేనన్‌ కథానాయికలు.  సప్తగిరి, నర్రా శ్రీనివాస్‌, అనీష్‌ కురువిల్ల, వినోధిని వైద్యనాథన్‌, రవిప్రకాశ్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చిత్ర టీజర్‌ విడుదల చేశారు. టైటిల్‌కు తగ్గట్లుగానే సినిమాలో ఆది పాత్ర చాలా క్రేజీగా ఉంటుంది. అతను చేసే పనులు తనకు కావాల్సిన వారికి ఇబ్బందులు కలిగిస్తుంటాయి. ఇలాంటి వ్యక్తి జీవితంలోకి ఇద్దరు అమ్మాయిలు  ఎంట్రీ ఇస్తారు. మరి ఆ తర్వాత ఏమైంది? అన్నది మిగతా కథ అని చిత్ర వర్గాలు తెలిపాయి. సంగీతం: ఆర్‌.ఆర్‌.ధ్రువన్‌, కూర్పు : సత్య గిడుతూరి, ఛాయాగ్రహణం: సతీష్‌ ముత్యాల. ఈ సినిమా అక్టోబర్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events