Namaste NRI

ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించిన రిషి సునాక్‌

బ్రిటన్‌ ప్రధాన మంత్రి ఎన్నికల ప్రక్రియ తుది అంశానికి చేరుకుంది. కన్జర్వేటివ్‌ పార్టీలో  మాజీ ఆర్థిక మంత్రి, భారతీయ మూలాలున్న రిషి సునాక్‌ విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ల మధ్య పోరు చివరి దశకు దగ్గరైంది. సొంత కన్జర్వేటివ్‌ పార్టీ (టోరీ) సభ్యుల మద్దతు కోసం ఇద్దరు చివరిసారిగా అభ్యర్థించి ప్రచారాన్ని ముగించారు. పలు సర్వేల్లో సునాక్‌ కంటే ట్రస్‌ ముందంజలో ఉన్నట్లు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రుషి సునాక్‌ కొత్త అస్త్రాన్ని ప్రయోగించారు. బ్రిటన్‌ను ప్రపంచంలో అత్యుత్తమ దేశంగా తీర్చిదిద్దేందుకు పగలు, రాత్రి పని చేస్తానని ఆయన శపథం చేవారు. లండన్‌లోని వింబ్లేలో చివరి ప్రచార ప్రసంగం సందర్భంగా సునాక్‌ తన భార్య, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాసేవలోకి అడుగుపెట్టేలా వాళ్లు నాకెంతగానో స్ఫూర్తినందించారు.  పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేసిన అమ్మానాన్నలకు రుణపడి ఉంటా. సన్మార్గంలో నడిపించే కష్టపడే తత్వం, నేర్పించి కుటుంబం కోసం శ్రమించే సామర్థ్యాలను అందించారు అన్నారు. అక్షిత ఓ అద్భుతమైన, ప్రేమమయ సతీమని అంటూ భార్యను పొగడ్తల్లో ముంచెత్తారు. ఈ ఘనమైన దేశంలో సాధించలేనిదంటూ ఏదీ లేదంటూ ముగించారు. బ్రిటన్‌లో జీవన వ్యయం విపీరతంగా పెరగడం, నేరాలు, పన్నులు  పైకి ఎగబాకడం, వలస విధానంలో సంస్కరణలు విదేశాంగ విధానం తదితరాలపై సునాక్‌, ట్రస్‌ తమ ప్రాధాన్యాలను పేర్కొంటూ ప్రచార పర్యావన్ని ముగించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events