Skip to main content

Namaste NRI

భారతీయ అమెరికన్లకు కీలక బాధ్యతలు

మరో ఇద్దరు భారత- అమెరికన్లను అగ్ర రాజ్య అధ్యక్షుడు జో బైడెన్‌ కీలక పదవుల్లో నియమించారు. భారత సంతతికి చెందిన మను ఆస్తానా, మధు బెరివాల్‌లకు  నేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అడ్వైజరీ కౌన్సిల్‌ (ఎన్‌ఐఏసీ)లో స్థానం కల్పించనున్నట్లు బైడెన్‌ ప్రకటించారు. కీలకమైన మౌలికరంగ సదుపాయాల్లో భద్రతను పెంచడం, సైబర్‌ బెడదను అరికట్టడంపై అధ్యక్షుడికి ఎన్‌ఐఏసీ సలహాలిస్తుంది. ఇక ఉత్తర అమెరికాలోనే అతి పెద్ద విద్యుత్‌ గ్రిడ్‌ పర్యవేక్షణ బాధ్యతలను విద్యుత్‌ రంగ నిపుణుడైన ఆస్తానాకు అప్పగించారు. 1985లో ఇన్నోవేటివ్‌ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌.ఇంక్‌ (ఐఇఎం)ని స్థాపించిన మధు బెరివాల్‌ను కూడా కీలక బాధ్యతలు అప్పగించింది.

Social Share Spread Message

Latest News