ప్రపంచ అతిపెద్ద కాఫీ చైన్ స్టార్‌బక్స్ సీఈఓగా భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని స్టార్‌బక్స్ కార్ప్ ప్రకటించింది. గ్లోబల్‌గా మరో ప్రముఖ కంపెనీకి సీఈవోగా ప్రవాస భారతీయుడు లక్ష్యణ్ నరసింహన్ ఎంపిక కావడం విశేషం. అయితే అక్టోబర్‌లో కంపెనీలో చేరనున్న నరసింహన్ ఏప్రిల్ 1న 2023లో పూర్తి బాధ్యతలను స్వీకరిస్తారని కంపెనీ ప్రకటించింది. ఇప్పటిదాకా డ్యూరెక్స్ కండోమ్‌లు, ఎన్‌ఫామిల్ బేబీ ఫార్ములా, మ్యూసినెక్స్ కోల్డ్ సిరప్‌లను తయారు చేసే రెకిట్ సంస్థకు నరసింహన్ సీఈవోగా ఉన్నారు. అయితే ఈ పదవి నుంచి వైదొలగుతున్నట్లు స్టార్‌బక్స్ ప్రకటనకు ముందు రోజు ప్రకటించారు. గతంలో పెప్సికోలో గ్లోబల్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌గా పనిచేసిన నరసింహన్ అమ్మకాలు క్షీణించిన సందర్భంలో కంపెనీని పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో కాఫీ దిగ్గజం నరసింహన్‌కు తమ కీలక అధికారిగా నియమించుకుంది. ముఖ్యంగా ఈ దశాబ్దం చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 20 వేలకు పైగా స్టార్‌బక్స్ ఔట్‌లెట్స్ తెరవాలన్న టార్గెట్‌ను చేరుకునేందుకు సరిjైున వ్యక్తిగా నరసింహన్‌ను ఎంపిక చేసింది.














