చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరెక్కుతోన్న చిత్రం గాడ్ ఫాదర్. కొణిదేల సురేఖ సమర్పణలో ఆర్‌బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సల్మాన్ ఖాన్ కీలక పాత్ర చేస్తున్నారు. నయనతార, పూరి జగన్నాథ్, సత్యదేవ్ ముఖ్య పాత్రధారులు. ఈ చిత్రంలో నయనతార చేస్తున్న సత్యప్రియ జయదేవ్ పాత్ర ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. చీరకట్టులో హుందాగా కూర్చొని టైప్ రైటర్‌లో ఏదో లెటర్‌ని రెడీ చేస్తూ కనిపించారు నయనతార. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతన్న చిత్రం గాడ్ ఫాదర్. ఇందులో చిరంజీవి స్టాల్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపిస్తారు అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రం అక్టోబర్ 8న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంగీతం : తమన్, కెమెరా: నీరవ్ షా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వాకాడ అప్పారావు. ఛాయాగ్రహణం: నీరవ్ షా, కళ: సురేష్ సెల్వరాజన్, సమర్పణ: కొణిదెల సురేఖ.














