కిరణ్ అబ్బవరం, సంజనా ఆనంద్ జంటగా శ్రీధర్ గాదె దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం నేను మీకు బాగా కావాల్సినవాడిని. కోడి రామకృష్ణ సమర్పణలో కోడి దివ్వ ఎంటర్టైన్మెంట్స్పై కోడి దివ్వ దీప్తి నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ని హీరో పవన్ కల్యాణ్ విడుదల చేసి, యూనిట్‌కి అభినందనలు తెలిపారు. ట్రైలర్ చూస్తుంటే సినిమాలో అన్ని కమర్షియల్ హంగులు సమపాళ్లలో ఉన్నట్లు అర్థమవుతుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. ఇందులో కిరణ్ క్యాబ్ డ్రైవర్‌గా మాస్ లుక్‌లో కనిపించనున్నారు. అన్ని కమర్షియల్ హంగులు సమపాళ్లలో ఉన్న ఈ చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుంది అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమా సెప్టెంబర్ 16న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: రాజ్ కె.నల్లి. సహ నిర్మాత: నరేష్ రెడ్డి మూలే.














