Namaste NRI

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి  ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

 సుధీర్‌బాబు, కృతిశెట్టి జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.  మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో బి.మహేంద్రబాబు, కిరణ్‌ బల్లపల్లి నిర్మించారు. హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. కథానాయకులు నాగచైతన్య మాట్లాడుతూ ఈ మధ్య ధియేటర్‌ ఏమైపోతోంది? ప్రేక్షకులు వస్తారా రారా? అంటూ అంతా భయపడ్డారు. కథ బాగుంటే ప్రేక్షకులు థియేటర్‌కి వచ్చి సినిమాని ఆస్వాదిస్తారు. ఈ మధ్య సినిమాలు అదే విషయాన్ని నిరూపించాయి. ఈ సినిమా కూడా తప్పక విజయవంతం అవుతుందని నమ్ముతున్నా. సుధీర్‌, నా ప్రయాణం ఏమాయ చేసావె తో మొదలైంది. అక్కడ ఐదు నిమిసాల ఫైట్‌ సీక్వెన్స్‌ చేశాడు. ఇప్పుడు ఏ సినిమానైనా భుజాలపై మోసేలా ఆల్‌రౌండ్‌ నటుడు అయ్యాడు. కృతిశెట్టి కథానాయికగా చాలా దూరం ప్రయాణిస్తుంది అన్నారు. ఈ కార్యక్రమానికి అడివి శేష్‌, సిద్ధు జొన్నలగడ్డ, అవసరాల శ్రీనివాస్‌తో పాటు దర్శకులు హరిష్‌శంకర్‌, అనిల్‌ రావిపూడి, వెంకీ కుడుముల, రాహుల్‌ సంకృత్యాన్‌ హాజరయ్యారు. ఈ నెల 16న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events