Namaste NRI

గుర్రమెక్కిన చందమామ

అందం, అంతే చక్కని అభినయంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేసిన చందమామ కాజల్‌. ఈ భామ తిరిగి ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టింది. గుర్రపు స్వారీ చేస్తున్న వీడియోను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంది. ఇటీవల ఓ బాబుకు జన్మనిచ్చిన  కాజల్‌.. 4 నెలల తర్వాత తిరిగి నా పనిలోకి వెళ్లాను. గతంలో నా శరీరం ఎలా ఉండేదో ఇప్పడలా లేదు. తల్లి అయ్యాక నా శరీరంలో ఎన్నో మార్పులొచ్చాయి. గుర్రాన్ని ఎక్కడం, దాని స్వారీ చేయడం చాలా పెద్ద పనిలా అనిపించింది. శరీరంలో మార్పులు రావొచ్చు. కానీ మనలోని నేర్చుకోవాలన్న తపనకు ఏదీ అడ్డుకాదు. ప్రతికూల పరిస్థితులను బలహీనతలను గట్టి మనోధైర్యంతో ఎదిరించి ముందుకెళ్లాలి అని కాజల్‌ పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News