Skip to main content

Namaste NRI

పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసేవారికి… గుడ్ న్యూస్

పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. పాస్‌పోర్ట్‌ మంజూరులో పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ (పీసీసీ) జారీ జాప్యాన్ని నివారించేందుకు కేంద్ర హోం శాఖ కొత్త విధానాన్ని ప్రకటించింది. ఇక దేశవ్యాప్తంగాఉన్న అన్ని పోస్టాఫీస్‌ పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాల్లో పాస్‌పోర్ట్‌ దరఖాస్తుదారులే నేరుగా పీసీసీ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.  ఫలితంగా పాస్‌పోర్టు కార్యాలయం అధికారులు వివరాలను స్థానిక పోలీసులకు పంపించి వాకబు చేసే అవసరం తగ్గి సమయం ఆదా అవుతుంది. ఈ నెల 28వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.

Social Share Spread Message

Latest News