Skip to main content

Namaste NRI

ఆదిపురుష్ టీజర్ వచ్చేది అప్పుడే

ప్రభాస్‌ నటిస్తున్న  ప్రతిష్టాత్మక చిత్రం ఆదిపురుష్‌. రామాయణం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కృతిహసన్‌ కథానాయిక. సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడు. ఆదిపురుష్‌ అప్‌డేట్‌ కోసం ప్రభాస్‌ అభిమానులతో పాటు సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణకు తెరదించుతూ సినిమా టీజర్‌ రిలీజ్‌ డేట్‌ను చిత్ర బృందం ప్రకటించింది. అక్టోబరు 2న అయోధ్యలో నిర్వహించనున్నారు. చిత్ర దర్శకుడు ఓం రౌత్‌ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడిరచారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు షురూ అవుతున్నాయి. దసరా నవరాత్రుల సందర్భంగా శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో టీజర్‌ని విడుదల చేయాలని నిర్ణయించారు.  అందుకోసం ఏర్పాట్లు మొదలు పెట్టినట్టు సినీ వర్గాలు తెలిపాయి. ఐమాక్స్‌ ఫార్మేట్‌తో పాటు, త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న  ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.

Social Share Spread Message

Latest News