Namaste NRI

ఎస్ బాస్ అంటున్న యంగ్ హీరో హావిష్

హావిష్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ఎస్‌ బాస్‌. ఏ స్టూడియోస్‌ బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. బాగమతి చిత్ర దర్శకుడు అశోక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో బ్రహ్మానందం ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ రచయిత ఆకుల శివ ఈ సినిమాకు కథ, మాటలు అందిస్తున్నారు. దర్శకుడు అశోక్‌ భాగమతి సినిమా తరువత కొంత గ్యాప్‌ తీసుకొని చేస్తున్న సినిమా ఇది. ఈ చిత్ర రెండో షెడ్యూల్‌ అక్టోబర్‌ మూడో వారంలో మొదలు కాబోతోంది. రవితేజ ఖిలాడి సినిమా తరువాత కోనేరు సత్యనారాయణ నిర్మిస్తోన్న సినిమా ఇదే అవ్వడం విశేషం. త్వరలో ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ విడుదల కానుంది.ఈ  చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఛాయాగ్రహణం : సాయి ప్రకాశ్‌.

Social Share Spread Message

Latest News