Skip to main content

Namaste NRI

వారణాసి నేపథ్యంతో సాగే ప్రేమ కథ ..బనారస్

జైద్‌ ఖాన్‌, సోనాల్‌ జంటగా  నటిస్తున్న సినిమా బనారస్‌. జయ తీర్థ దర్శకత్వం వహిస్తున్నారు. తిలక రాజ్‌ బల్లాల్‌ నిర్మాత. వారణాసి నేపథ్యంలో సాగే ఆహ్లాదరక ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కుతున్నది. ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల కార్యక్రమం బెంగళూరులో జరిగింది. ఈ సందర్భంగా   దర్శకుడు  జయ తీర్థ మాట్లాడుతూ బలమైన కథ కథనాలు ఉన్నత సాకేంతిక విలువలతో మంచి  అనుభూతిని పంచే చిత్రాన్ని రూపొందించాం. పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యేలా సినిమా ఉంటుంది అన్నారు. హీరో జైద్‌ ఖాన్‌ మాట్లాడుతూ నటుడు కావాలన్న నా కల ఈ చిత్రంతో తీరుతున్నది. నన్ను హీరోగా పరిచయం చేస్తున్న నిర్మాత తిలక రాజ్‌ బల్లాల్‌కు కృతజ్ఞతలు. మంచి ప్రేమ కథా చిత్రమిది. సకుటుంబంగా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుంది అన్నారు. నవంబర్‌ 4న పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో విడుదల చేయబోతున్నారు. ఈ  కార్యక్రమంలో బాలీవుడ్‌ నటుడు అర్బాజ్‌ ఖాన్‌, కన్నడ హీరో రవిచంద్రన్‌ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News