Namaste NRI

అనిల్ రావిపూడి చేతులు మీదుగా కాఫీ విత్ ఎ కిల్లర్ ట్రైలర్ రిలీజ్

శ్రీనివాస రెడ్డి, రవిబాబు, సత్యం రాజేష్‌, రఘు బాబు తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా కాఫీ విత్‌ ఎ క్లిర్‌. ఈ చిత్రానికి ఆర్పీ పట్నాయక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సతీష్‌ నిర్మాత. ఈ చిత్ర  ట్రైలర్‌ను అనిల్‌ రావిపూడి విడుదల చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కథా బలమున్న చిత్రాలకే ఆదరణ కనిపిస్తోంది. ఇప్పడలాంటి ఛాయలు ఈ చిత్ర ట్రైలర్‌లో కనిపిస్తున్నాయి.  ప్రచార చిత్రం చాలా వినోదాత్మకంగా ఉంది. నిజంగా ఓ కాపీ షాప్‌లో ఇన్ని జరుగుతుంటాయి కాబోలు అని అర్థమైంది. ఈ చిత్రం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నారు.  దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌ మాట్లాడుతూ  వినోదం, థ్రిల్‌ అంశాలు చేర్చి ఈ చిత్రాన్ని రూపొందించాము. ఒక కన్సెప్ట్‌తో కొత్త ప్రయత్నం చేశాం. ఇందులో సర్‌ప్రైజ్‌ ఉంది. త్వరలో అదేంటో చెబుతాం అన్నారు. నిర్మాత సతీష్‌ మాట్లాడుతూ విభిన్న కాన్సెప్ట్‌తో కొత్త తరహాలో సినిమా తెరకెక్కించాం అన్నారు.  చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తాం అన్నారు.

Social Share Spread Message

Latest News