Namaste NRI

గీతా ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ద్వారా భేదియా హంగామా

నిర్మాత దినేశ్‌ విజన్‌ హారర్‌ కామెడీ ప్రపంచంలో భాగంగా రూపుదిద్దుకున్న చిత్రం భేడియా. వరుణ్‌ ధావన్‌ కథానాయకుడు, కృతిససన్‌ కథానాయిక. అమర్‌ కౌశిక్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈ నెల 25న హిందీతో పాటు తమిళం, తెలుగు భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో గీత ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ విడుదల చేస్తోంది. తోడేలు కాటుకు గురైన భాస్కర్‌ అనే యువకుడిగా వరుణ్‌ ధావన్‌, డాక్టర్‌ అనిక పాత్రలో కృతిసనన్‌ నటించిన చిత్రమిది. ఇదివరకే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది.  మేకర్స్‌ ఇపుడు ప్రమోషన్స్‌  బిజీగా ఉన్నారు.  నిర్మాతలు అల్లు అరవింద్‌, బన్నీ వాస్‌ మరోసారి కథాబలం ఉన్న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారని  సినీ వర్గాలు తెలిపాయి.

Social Share Spread Message

Latest News