ఫ్రాన్ప్ రాజధాని పారిస్‌లో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. సెంట్రల్ పారిస్‌లో ఓ ఆగంతకుడు సాటి పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. కాల్పులకు పాల్పడిన ఆగంతకుడిని అదుపులోకి తీసుకున్నట్లు పారిస్ పోలీసులు తెలిపారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 10 ఆర్రోండిస్సెమెంట్‌లోగల రుడి ఎంగియన్ ఏరియాలో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఘటన నేపథ్యంలో ప్రజలు ఎవరూ ఆ ఏరియా వైపు రావద్దని పోలీసులు హెచ్చరించారు. నిందితుడు ఎందుకు కాల్పులకు తెగబడాల్సి వచ్చిందనే వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు.














