Skip to main content

Namaste NRI

అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

అగ్ర‌రాజ్యం అమెరికా భూతల దాడికి దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేసినా గట్టిగా బదులిస్తామని స్పష్టంచేసింది. ఇరాన్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ అమెరికాతో కుదిరిన అవగాహనా ఒప్పందం స్పష్టంగా ఉందని, అందులో ఎలాంటి సందిగ్ధత లేదని అన్నారు.

ఒప్పందం చిన్నదే అయినా మొత్తం 14 క్లాజ్‌లు ఉన్నాయని ఇస్మాయిల్ బ‌ఘాయీ చెప్పారు. హర్మూజ్‌ జలసంధి భవిష్యత్ నిర్వహణ బాధ్యత ఇరాన్‌కే చెందుతుందని, ఈ అంశాన్ని ఒమన్‌తోపాటు ప్రాంతీయ దేశాలతో చర్చిస్తూ ముందుకు తీసుకెళ్తామ‌ని అన్నారు. ఒప్పందంలోని నిబంధనలు స్పష్టంగా ఉన్నందున, దాన్ని ఉల్లంఘించడానికి అమెరికాకు ఎలాంటి అవకాశం లేదని తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events