Namaste NRI

అంతర్జాతీయ గూఢచారి వస్తున్నాడు

అడివి శేష్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం గూఢచారి.  శశికిరణ్‌ తిక్క దర్శకత్వం వహించిన ఈ సినిమా స్పైథ్రిల్లర్‌గా మెప్పించింది. తాజాగా చిత్రానికి జీ2 పేరుతో సీక్వెల్‌ను రూపొందించబోతున్నారు.  ఈ సందర్భంగా  కాన్సెప్ట్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. జీ2 కథ అంతర్జాతీయంగా జరుగుతుందని, కొత్త పాత్రల చేరికతో రెట్టింపు యాక్షన్‌ ఘట్టాలతో మెప్పిస్తుందని అడివి శేష్‌ పేర్కొన్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించనున్నారు. అడివి శేష్‌ స్వయంగా కథ అందిస్తున్న ఈ సీక్వెల్‌ను ‘మేజర్‌’ చిత్రానికి ఎడిటర్‌గా పనిచేసిన వినయ్‌ కుమార్‌ సిరిగినీడి దర్శకత్వం వహించబోతున్నారు.  జనవరి 9న పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రారంభంకానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events