Namaste NRI

మార్చి 31న భూతద్ధం భాస్కర్‌ నారాయణ

  శివ కందుకూరి హీరోగా రాశీసింగ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం  భూతద్ధం భాస్కర్‌ నారాయణ. పురుషోత్తం రాజ్‌ దర్శకుడు.  స్నేహల్‌ జంగాల, శశిధర్‌ కాశీ, కార్తీక్‌ ముడుంబై సంయుక్తంగా మిలియన్‌ డ్రీమ్‌ క్రియేషన్స్‌, విజయ సరాగ ప్రొడక్షన్స్‌ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం యొక్క మొద‌టి లుక్ నుండి రీసెంట్ గా విడుద‌ల చేసిన మొష‌న్ పోస్ట‌ర్ వ‌ర‌కూ సినిమా కాన్సెప్ట్ ని ఇన్‌స‌ర్ట్ చేసి వైవిధ్యం గా ప్రెజెంటేష‌న్ చేశారు నిర్మాత‌లు. ఈ చిత్రానికి సంభందించిన ప్ర‌తి ప్ర‌మోష‌న్ మెటీరియ‌ల్ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది.  ఈ చిత్రం లో ఏ స‌న్నివేశాన్ని ముందుగా ఊహించడం చాలా క‌ష్టం గా వుండేలా ద‌ర్శ‌కుడు స్క్రీన్‌ప్లే వుంటుంది. ఈ చిత్రానికి సంభందించి మ‌రిన్ని అప్‌డేట్స్ సంక్రాంతి సీజ‌న్ తరువాత ప్రేక్ష‌కుల‌కి అందిస్తామ‌ని నిర్మాత‌లు తెలిపారు.

    ఈ చిత్రం మార్చి 31న విడుదల కానుంది. ఈ మేరకు పోస్టర్‌ ద్వారా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు.  ఈ చిత్రానికి శ్రీచరణ్‌ పాకాల, విజయ్‌ బుల్గానిన్‌ సంగీతం అందించారు. ప్రస్తుతం పొస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రానికి రచన-దర్శకత్వం: పురుషోత్తం రాజ్‌, నిర్మాతలు: స్నేహల్‌ జంగాల, శశిధర్‌ కాశి, కార్తీక్‌ ముడుంబై, సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, విజయ్‌ బుల్గానిన్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ: గౌతమ్‌ జి, ఎడిటర్‌: గ్యారీ బిహెచ్‌, ప్రొడక్షన్‌ డిజైనర్: రోషన్‌ కుమార్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్స్‌: అశ్వంత్‌, ప్రతిభ, స్టంట్స్‌: అంజిబాబు, పీఆర్‌ఓ: ఏలూరు శ్రీను, మేఘశ్యామ్‌,  డిజిటల్‌: హౌస్‌ఫుల్‌ డిజిటల్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events