శివ కందుకూరి హీరోగా రాశీసింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం భూతద్ధం భాస్కర్ నారాయణ. పురుషోత్తం రాజ్ దర్శకుడు. స్నేహల్ జంగాల, శశిధర్ కాశీ, కార్తీక్ ముడుంబై సంయుక్తంగా మిలియన్ డ్రీమ్ క్రియేషన్స్, విజయ సరాగ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం యొక్క మొదటి లుక్ నుండి రీసెంట్ గా విడుదల చేసిన మొషన్ పోస్టర్ వరకూ సినిమా కాన్సెప్ట్ ని ఇన్‌సర్ట్ చేసి వైవిధ్యం గా ప్రెజెంటేషన్ చేశారు నిర్మాతలు. ఈ చిత్రానికి సంభందించిన ప్రతి ప్రమోషన్ మెటీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం లో ఏ సన్నివేశాన్ని ముందుగా ఊహించడం చాలా కష్టం గా వుండేలా దర్శకుడు స్క్రీన్‌ప్లే వుంటుంది. ఈ చిత్రానికి సంభందించి మరిన్ని అప్‌డేట్స్ సంక్రాంతి సీజన్ తరువాత ప్రేక్షకులకి అందిస్తామని నిర్మాతలు తెలిపారు.
ఈ చిత్రం మార్చి 31న విడుదల కానుంది. ఈ మేరకు పోస్టర్ ద్వారా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. ప్రస్తుతం పొస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రానికి రచన-దర్శకత్వం: పురుషోత్తం రాజ్, నిర్మాతలు: స్నేహల్ జంగాల, శశిధర్ కాశి, కార్తీక్ ముడుంబై, సంగీతం: శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ: గౌతమ్ జి, ఎడిటర్: గ్యారీ బిహెచ్, ప్రొడక్షన్ డిజైనర్: రోషన్ కుమార్, కాస్ట్యూమ్ డిజైనర్స్: అశ్వంత్, ప్రతిభ, స్టంట్స్: అంజిబాబు, పీఆర్‌ఓ: ఏలూరు శ్రీను, మేఘశ్యామ్, డిజిటల్: హౌస్‌ఫుల్ డిజిటల్.














