Skip to main content

Namaste NRI

యుగల్‌ పోస్టర్‌ విడుదల 

జీఎస్‌ఎన్‌ నాయుడు ప్రధాన పాత్రలో ప్రమోద్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం  యుగల్‌.  ది మాన్‌ విత్‌ డైవర్షన్‌ అనేది ట్యాగ్‌ లైన్‌. శ్రీలక్ష్మీ గణపతి సుబ్రమణ్య స్వామి ప్రొడక్షన్స్‌ పతాకంపై ఆర్‌. బాలాజీ నిర్మిస్తున్నారు.  ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా జీఎస్‌ఎన్‌ నాయుడు మాట్లాడుతూ  యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. ఈ మూవీకి తొలుత గన్నీ అనే  టైటిల్‌ అనుకున్నాం. కానీ, ఆ టైటిల్‌ వేరేవాళ్లు రిజిస్టర్‌ చేయించడంతో యుగల్‌ ఖరారు చేశాం అన్నారు. ఈ  చిత్రాన్ని రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్నట్టు తెలిపారు.  కెమెరామేన్‌  ప్రేమ్‌ జై విన్సన్ట్‌ కుమార్‌,  ప్రొడ్యూసర్‌  వినయ్‌ కుమార్‌, ఫిల్మ్‌ఛాంబర్‌ చీఫ్‌ సెక్రటరీ అనుపమ్‌ రెడ్డి, రాహుల్‌, కథ స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ప్రమోద్‌కుమార్‌ మాట్లాడారు. ఈ చిత్రాన్ని పవన్‌ కల్యాణ్‌ గారి పుట్టిన రోజు  సెప్టెంబర్‌ 2న విడుదల చేస్తున్నామని అన్నారు.

Social Share Spread Message

Latest News