జీఎస్‌ఎన్ నాయుడు ప్రధాన పాత్రలో ప్రమోద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం యుగల్. ది మాన్ విత్ డైవర్షన్ అనేది ట్యాగ్ లైన్. శ్రీలక్ష్మీ గణపతి సుబ్రమణ్య స్వామి ప్రొడక్షన్స్ పతాకంపై ఆర్. బాలాజీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా జీఎస్‌ఎన్ నాయుడు మాట్లాడుతూ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. ఈ మూవీకి తొలుత గన్నీ అనే టైటిల్ అనుకున్నాం. కానీ, ఆ టైటిల్ వేరేవాళ్లు రిజిస్టర్ చేయించడంతో యుగల్ ఖరారు చేశాం అన్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్నట్టు తెలిపారు. కెమెరామేన్ ప్రేమ్ జై విన్సన్ట్ కుమార్, ప్రొడ్యూసర్ వినయ్ కుమార్, ఫిల్మ్‌ఛాంబర్ చీఫ్ సెక్రటరీ అనుపమ్ రెడ్డి, రాహుల్, కథ స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ప్రమోద్‌కుమార్ మాట్లాడారు. ఈ చిత్రాన్ని పవన్ కల్యాణ్ గారి పుట్టిన రోజు సెప్టెంబర్ 2న విడుదల చేస్తున్నామని అన్నారు.














