Skip to main content

Namaste NRI

రెండేండ్ల తర్వాత డొనాల్డ్ ట్రంప్‌పై నిషేధం ఎత్తివేత

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై  ఉన్న నిషేధాన్ని ప్రముఖ సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌  ఎత్తివేశాయి. 2021లో యూఎస్ క్యాపిటల్పై జరిగిన దాడి తర్వాత ఆయనను బ్యాన్ చేశాయి. అయితే రెండేండ్ల తర్వాత ఆయన అకౌంట్లను పునరుద్ధరిస్తున్నట్లు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌  మాతృసంస్థ మెటా ప్రకటించింది. ప్రజలు ఇకపై తమ రాజకీయ నాయకులు ఏం చెబుతున్నారో వినవచ్చు. అది మంచైనా, చెడైనా అంటూ బ్లాగ్ స్పాట్ వేదికగా వెల్లడించింది. ప్రజలు బ్యాలట్ బ్యాక్స్ ద్వారా తమ చాయిస్‌ను  తెలపొచ్చని పేర్కొన్నది.

Social Share Spread Message

Latest News